25 May, 2026 | 1:04 AM

జిల్లాలో 75 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి

25-05-2026 12:00 AM

కరీంనగర్, మే24(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లాలోఇప్పటివరకు సుమారు 75 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయింది, మిగిలిన కొనుగోళ్లను కూడా వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని కలెక్టర్ చిత్ర మిత్ర పేర్కొన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 68 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కాగా ఇప్పటి వరకు మొత్తం 2,29,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్ల విలువ రూ.544.74 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.407.21 కోట్లు జమ అయినాయి.  గత నాలుగు రోజుల్లోనే 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరపదం విశేషం.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ, లోడింగ్‌అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారు