16 August, 2026 | 4:45 PM

ఉచిత ఆవుపాల పంపిణీ

16-08-2026 03:05 PM

నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని 

ఉచిత ఆవుపాల పంపిణీ

నిజామాబాద్,ఆగస్టు 16 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని ఉచిత ఆవుపాల పంపిణీ నిర్వహిస్తున్నట్టు గోకుల్ గోసేవ సమితి నిర్వాహకులు తెలియజేశారు. రేపు నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో కూడా సుమారు 100 సెంటర్లలో 1000 లీటర్ల పాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలియజేశారు. 

గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు రామ్మోహన్ తెలియచేశారు.  సకల దేవతల స్వరూపమైన గోమాతను రక్షించాలని  గోమాతకు పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసిన పుణ్యం వస్తుందని ఆయన తెలియజేశారు.  రేపు ఉదయం 6:00 నుంచి 12:00 వరకు ఈ ఉచిత పాల పంపిణీ జరుగుతోందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గోకుల్ గో సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.