16 August, 2026 | 4:01 PM

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

16-08-2026 03:22 PM

మేడారం: ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్‌తో పాటు మేడారానికి మంత్రి పొంగులేటి, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ స్వాగతం పలికారు. మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మకు( Medaram Sammakka-Saralamma) సీఎం నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు.

మేడారంలో ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల సమక్షంలో సీఎం రేవంత్, మంత్రులకు మంత్రి సీతక్క(Minister Seethakka) రాఖీలు కట్టారు. మేడారం వనదేవతల సమక్షంలో చూయూత పింఛన్లకు సీఎం శ్రీకారం చుట్టారు. చేయూత పథకం కింద ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. పలువురు మహిళలకు కొత్త పింఛన్ మంజూరు పత్రాలు ఇచ్చారు. వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. పలువురు వితంతువులు, ఒంటరి మహిళలకు సీఎం పింఛన్లు అందించారు.