15 July, 2026 | 6:29 AM

పుట్టినరోజు

07-12-2024 12:39 AM

ఇవాళ దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు. ఆయన 1975 డిసెంబర్ 7న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, మాచినపల్లి గ్రామంలో జన్మించారు. సురేందర్ రెడ్డి డిగ్రీకి మధ్యలోనే గుడ్ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చేశారు. మణిరత్నం ‘ఘర్షణ’, వర్మ ‘శివ’ చూశాక సినిమా దర్శకుడవ్వాలన్న కోరిక కలిగిందట. కానీ అదంత సులువు కాదని తక్కువ సమయంలోనే తెలిసొచ్చిందట. ఎన్నో కష్టాలను అనుభవించిన తరువాత ‘అతనొక్కడే’ సినిమా తీశారు. అది మంచి విజయం సాధించింది. ఆ తరువాత ‘రేసుగుర్రం’, ‘సైరా నర్సింహారెడ్డి’ చిత్రాలు సురేందర్ రెడ్డికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.