బతుకమ్మకుంటలో పదెకరాల చెరువు ఉండేది: హైడ్రా కమిషనర్
హైదరాబాద్: వరదలు నివారించేందుకు హైకోర్టు తమకు అనుమతి ఇచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్( Hydra Commissioner AV Ranganath) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ ఉత్తర్వులను పాటిస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. బతుకమ్మ కుంట వద్ద అసలు చెరువు లేదని ఎడ్ల సూధాకర్ పిటిషన్ వేశారని సూచించారు.
సర్వే ఆఫ్ ఇండియా(Survey of India) ప్రకారం అక్కడ చెరువు ఉందని స్పష్టమైందన్నారు. సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అక్కడ పదెకరాలు చెరువు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. చెరువు భూమికి తానే యజమాని అని ఎడ్ల సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. బతుకమ్మ కుంట పునరుద్ధరించడంపై ఎడ్ల సుధాకర్ కోర్టుకు వెళ్లారని చెప్పారు. అసలు చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. చెరువులోని భూమిలో వ్యవసాయం చేసినట్లు సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. చెరువును పూడ్చి కూడా వ్యవసాయం చేయవచ్చు.. అలా చేసినంత మాత్రాన చెరువుకు యజమాని అయిపోరని రంగనాథ్ వెల్లడించారు.






