ఏజెన్సీ బంద్ విజయవంతం
19-08-2026 05:33 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): పోలీస్ ఉద్యోగాల్లో ప్రభుత్వ జీవో 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ తో తుడుం దెబ్బ ఏజెన్సీ బందుకు పిలుపు ఇచ్చింది. తుడుం దెబ్బ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు ఏజెన్సీలో బంద్విజయవంతమైంది. ఉట్నూర్ డివిజన్ కేంద్రంతోపాటు ఇంద్రవెల్లి, నార్నూర్, గాది కూడా మండలాల పరిధిలోని గ్రామాల్లో వ్యాపార దుకాణాలు మూసి వేశారు. బంద్ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు వ్యాపార దుకాణాలను మూసి ఉంచే విధంగా తిరుగుతూ ప్రచారం చేశారు.






