19 August, 2026 | 5:21 PM

ఏపిఎం అవార్డు గ్రహీత పాలడుగు హరి నారాయణకు సన్మానం

19-08-2026 04:50 PM

ఎర్రుపాలెం ఆగస్టు 19( విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా  ఉత్తమ ఏపీఎంగా ఎన్నికై స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు  మల్లు బట్టి విక్రమార్క  చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎర్రుపాలెం ఏపీఎం  పాలడుగు హరి నారాయణ కు బుధవారం నాడు  మండలంలో ఉన్న వెలుగు ఆఫీసు నందు, నవ శకం వారు మర్యాదపూర్వం కలిసి శాలవతో ఘనంగా సన్మానించారు. ఈ  కార్యక్రమంలో నవ శకం ఫౌండర్ మేకల రమేష్, నవ శకం ఎర్రుపాలెం మండలం అధ్యక్షులు మారభత్తులు మోహన్ రావు , సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య , సిపిఎం ఎరుపాలెం మండలం కార్యదర్శి మద్దాల ప్రభాకర్ ,, నవ సకం సభ్యులు సగుర్తి ముత్యాల రావు , తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.