17 April, 2026 | 12:08 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

పర్సంటేజీ విధానం కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకర్ని

31-05-2025 12:48 PM

గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉంది: ఆర్.నారాయణమూర్తి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల(Gaddar Telangana Film Awards) ప్రకటించడం గర్వంగా ఉందని ప్రముఖ సినీనటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి( R Narayana Murthy) వెల్లడించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్ నారాయణమూర్తి గద్దర్ అవార్డుల విజేతలకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డులను ప్రకటించాలని నారాయణమూర్తి కోరారు.

పర్సెంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకుందని చెప్పిన ఆయన పర్సంటేజీలు ఖరారైతే తన లాంటి నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పర్సంటేజీ విధానం కోరుకునే వ్యక్తుల్లో తనుకుడా ఒకరని తెలిపారు. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) కోసమే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమని నారాయణమూర్తి కొట్టిపాడేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరును నారాయణమూర్తి ఖండించారు. హరిహర వీరమల్లును అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారనడం సరికాదని వ్యాఖ్యనించారు. స్వయంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని విమర్శించారు.