16 July, 2026 | 1:04 AM

భారత్‌పై 100 శాతం సుంకాలు!

16-07-2026 12:50 AM
  1. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, స్లొవేకియా, హంగరీ, అజర్‌బైజాన్‌పై గరిష్ట సుంకాలు 
  2. ఆర్థిక బంకర్ బిల్లుకు అమెరికా మార్పులు

వాషింగ్టన్, జూలై 15: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా తదితర దేశాలపై సుంకాలు వేయడం, ఉక్రెయిన్ జరుగుతోన్న యుద్ధాన్ని ముగించేలా రష్యా పై ఐదు దేశాలతో ఒత్తిడి చేయించడమే ల క్ష్యంగా అమెరికా వ్యూహరచన చేస్తోంది. మరోపక్క రష్యా ఇంధనం నుంచి అతిపెద్ద కొనుగోలుదారులై చైనా, భారత్‌ను దూరం చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక బంకర్ బిల్లుకు అమెరికా మార్పులు చేర్పులు చేసింది.

ఈ బిల్లు అములలోకి వస్తే భారత్, చైనా, స్లొవేకియా, హంగరీ, అజర్‌బైజాన్‌పై 100 శాతం సుంకాలను విధించ నుంది. ఈ ఐదు దేశాలకే సవరించిన బిల్లు వర్తించనుంది. అలాగే అధ్యక్షుడికి విశేష అధికారాలను ఇవ్వనుంది. ఉక్రెయిన్ జరుగుతో న్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయా దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ఠ పరిమితిని 500 శాతం నుం చి 100 శాతానికి అమెరికా తగ్గించింది. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇందన ప్రాజెక్టులు లక్ష్యంగా చేసుకొని బిల్లును తీసుకువ చ్చారు.

ఇప్పుడు సవరించిన ఈ బిల్లుకు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది. ఇటీవల మృతి చెందిన సెనెటర్ లిండ్సే గ్రాహమ్.. ఈ ‘శాక్షనింగ్ రష్యా యాక్ట్’ను ప్రతిపాదించారు. రష్యా చమురు దిగుమతులు చేసుకొనే దేశాలపై అధ్యక్షుడు ట్రంప్‌నకు అసాధారణస్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తుంది. ఆ టారిఫ్‌లు 500 శాతం వరకు ఉండాలని ప్రతిపాదించారు. అప్పట్లో దీనిని ఆర్థిక బంకర్ బస్టర్‌గా అభివర్ణించారు.

రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌లో పుతిన్ సృష్టిస్తున్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయని అప్పట్లో గ్రాహమ్ ఆరోపించారు. ఇకపై ఆ దేశాలు రష్యా నుం చి చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు. అయితే ఇప్పు డు చేసిన సవరణలు కూడా మిత్రదేశాలకు అనుకూలంగా ఉండటం గమనార్హం. ఈ సుంకాలు అమల్లోకి వస్తే ముడిచమురు కొనుగోలు చేస్తోన్న ప్రధాన దేశాలు చైనా, ఇండియా, స్లొవేకియా, హంగరీ, అజ్బజాన్ లక్ష్యంగా మారనున్నాయి. రష్యా సహజ వా యువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జి యం ఉన్నాయి.

రష్యా సహజ వాయువు ఎగుమతులలో 15% కంటే తక్కువ దిగుమతి చేసుకుంటూ, ఆ సరఫరాలను తగ్గించ డానికి చర్యలు తీసుకుంటోన్న కొన్ని దేశాల కు ఈ బిల్లులో మినహాయింపులు ఇచ్చారు. ఈ నిబంధన జపాన్, ఫ్రాన్సు ప్రయోజనం చేకూర్చనుంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచ మురు ధరలు మరోసారి భగ్గుమంటున్నా యి.

ఈ క్రమంలో చమురు సరఫరాలో ఇ బ్బందులు కలగకుండా ఉం డేందుకు రష్యా ముడిచమురుపై అమెరికానే మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు వాటి ని తొలగించే పనిలో ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. మాస్కోను ఆర్థికంగా ఒత్తిడికి గురిచేయడానికి, భారత్ వంటి పెద్ద దిగుమతి దేశాలను రష్యా చమురుపై దూరం చేయడానికి అమెరికా ఈ చర్యలు చేపట్టింది.