31 August, 2026 | 9:54 PM

కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!

31-08-2026 08:36 PM

- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా కోర్టులో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెడతామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం అయ్యారు.  సెప్టెంబర్ 1నుండి నియోజకవర్గంలో ఏడు రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.