31 August, 2026 | 8:26 PM

సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి

31-08-2026 07:44 PM

ఎస్సీ వర్గీకరణ కోసమే కాదు సమాజం కోసం కూడా పాటు పడ్డాం

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

బిచ్కుంద,(విజయక్రాంతి): సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎమ్మార్పీఎస్ కృషి చేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని హసన్ టాక్లీ (చిన్న టాక్లి) గ్రామంలో ఏర్పాటు చేసిన సాహిత్య సామ్రాట్ లోక్ షహీర్ అన్నా బహు సాటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం పుట్టిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కేవలం ఎస్సీ వర్గీకరణ సాధన మాత్రమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిందన్నారు.

మాదిగలు సహాయాన్ని పొందిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. సహాయం పొందిన వారి రుణాన్ని ఎప్పటికీ ఉంచుకోరని అన్నారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన మహా పోరాటం కోసం తమకు సమాజంలోని అన్ని వర్గాలు తమకు మద్దతుగా నిలిచాయని అన్నారు. ఆశ సమాజం కోసం సమాజంలోని అన్ని వర్గాల కోసం ఎమ్మార్పీఎస్ తమ పోరాటాన్ని చేపట్టిందన్నారు. గుండె జబ్బుల పిల్లలకు ఆపరేషన్ లు చేపట్టాలని మొదట ఉద్యమం చేసింది తామేనని అన్నారు. సమాజంలో వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులకు పింఛన్లు పెరిగేందుకు తామే పాటు పడ్డామని అన్నారు.

రేషన్ బియ్యం నాలుగు కిలోల నుంచి 6 కిలోలు పెరిగేందుకు సైతం తామే కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం గొంగళి పురుగును సైతం ముద్దాడమని అన్నారు. వర్గీకరణకు మద్దతు పలికిన ప్రతి పార్టీకి తాము అండగా నిలిచామని అన్నారు. తమ పోరాటం న్యాయము, ధర్మమైనది ఉన్నందున, ప్రధాన మంత్రులు రాష్ట్ర మంత్రులు తమ న్యాయం వైపు నిలిచారని అన్నారు. ఎస్సీలలో వర్గీకరణ అయినందున ఎస్విల్లో ఉన్న 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు.