31 August, 2026 | 8:52 PM

గ్రామపంచాయతీలో మూడవ అనుబంధ గ్రామంగా చేర్చండి

31-08-2026 07:48 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే రమయినగర్, సుందర్ నగర్ లను ఏమై కుంట గ్రామపంచాయతీలో చేర్చి  జనాభాను  ప్రాతిపదికన  16 ఫైనాన్స్  నిధులు మంజూరు చేయాలని  గ్రామపంచాయతీ సర్పంచ్  జాదవ్ లకన్ ఎంపీడీవోకు దరఖాస్తు చేశారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవోకు దరఖాస్తు సమర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... మూడవ అనుబంధ గ్రామంగా  సుందర్ నగర్  లో నివాసముండే  ప్రజల రికార్డులు గ్రామపంచాయతీలు లేవని, గత పంచాయతీ ఎన్నికలకు ముందు సుందర్ నగర్ ను  ఏమైకుంట పంచాయతీలో విలీనం చేసినట్లు  అధికారులు చెప్పారే తప్ప  లిఖితపూర్వకంగా  ఆదేశాలు ఇవ్వలేదన్నారు. పంచాయతీ జనాభా తక్కువ ఉండడం వల్ల  ఈ అనుబంధ గ్రామం కి  పంచాయతీ నిధులు ఖర్చులు  చేయలేకపోతున్నామని  వాపోయారు. పూర్తి వివరాలను సేకరించి అనుబంధ గ్రామముగా చేర్చి  16 ఫైనాన్స్ నిధులు వచ్చే విధంగా  ప్రభుత్వానికి లేఖలు పంపాలని కోరారు.