21 March, 2026 | 11:14 PM

పెద్దపల్లి జిల్లాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు

21-03-2026 09:29 PM

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ 

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి, రామగుండం, మంథని, నియోజకవర్గా ల్లోని దర్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం విశిష్టతను వివరిస్తూ మత పెద్దలు హితబోధ చేశారు.  అదేవిధంగా పేద ముస్లిం కుటుంబాలకు దాన ధర్మాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండంలో ఈద్గాల వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విప్,  ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదేవిధంగా బడ్జెట్లో సైతం పెద్ద ఎత్తున మైనార్టీ సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నా రు. రంజాన్ పర్వదినం సంద ర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి తెలిపారు.