సేల్స్‌ఫోర్స్‌తో టాటా పవర్ భాగస్వామ్యం
హైదరాబాద్ ః భారతదేశంలోని అతిపెద్ద వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీలలో ఒకటైన 'టాటా పవర్', వేగంగా విస్తరిస్తున్న తన రూఫ్‌టాప్ సోలార్ , ఈవీ ఛార్జింగ్ మరియు స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ వ్యాపారాలను డిజిటల్‌గా మార్చేందుకు ప్రపంచ నంబర్ 1 ఏఐ సీఆర్ఎం ప్లాట్‌ఫారమ్ 'సేల్స్‌ఫోర్స్' తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఏఐ , ఆటోమేషన్ మరియు డేటా-ఆధారిత విధానాల ద్వారా సురక్షితమైన, స్మార్ట్ మరియు పూర్తి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, భారతదేశ 'నెట్-జీరో' లక్ష్యాలకు అనుగుణంగా టాటా పవర్ నిర్దేశించుకున్న దీర్ఘకాలిక క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్‌ను ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం చేస్తుంది.
ఈ ఒప్పందంలో భాగంగా టాటా పవర్ తన అనుబంధ పునరుత్పాదక ఇంధన సంస్థ అయిన 'టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అంతటా ఏజెంట్‌ఫోర్స్ సేల్స్ , ఏజెంట్‌ఫోర్స్ సర్వీస్ మరియు ఏజెంట్‌ఫోర్స్ మార్కెటింగ్ లను అమలు చేసింది. సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫారమ్ ఇంటెలిజెంట్, ఏఐ ప్రారంభించబడిన వర్క్‌ఫ్లోలను శక్తివంతం చేస్తుంది. ఇది పారదర్శకతను పెంచడంతో పాటు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఈ ప్లాట్‌ఫారమ్ భాగస్వాములు మరియు కస్టమర్ జర్నీలను ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ చేసేందుకు మరింత వీలు కలుగుతుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కింద టాటా పవర్ యొక్క రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ విభాగం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 200% పైగా వృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్‌ను విస్తరించడం, ఈవీ (EV) ఛార్జింగ్ సదుపాయాలను పెంచడం, అలాగే ఇంటెలిజెంట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టాటా పవర్ సీఈవో , ఎండీ డాక్టర్ ప్రవీర్ సిన్హా చెప్పారు. భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి టాటా పవర్ ఎంచుకున్న 'డిజిటల్-ఫస్ట్' విధానం.. దేశ ప్రగతిలో టెక్నాలజీ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టం చేస్తోందని సేల్స్‌ఫోర్స్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ , సీఈవో అరుంధతీ భట్టాచార్య తెలిపారు.




