21 March, 2026 | 11:56 PM

బడ్జెట్ కేటాయింపులో అన్ని వర్గాలకు సమన్వయ న్యాయం

21-03-2026 10:38 PM

299వ డివిజన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లు ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచే విధంగా ఉందని గుండ్లపోచంపల్లి 299వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు, మహిళలకు, పేద మధ్య తరగతి వారికి ఈ బడ్జెట్ చాలా అనుకూలంగా ఉందని ఆయన కొనియాడారు.

అలాగే ఆరోగ్యశ్రీ పథకం లాంటి గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సాయిపేట శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పేద తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ బీమా కింద రూ.5 లక్షల పథకం తీసుకొచ్చినందుకు పేద ప్రజలలు సంతోష పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.