తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ గా సునీల్ గౌడ్
హైదరాబాద్ ఃతెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ గా కుంచ సునీల్ గౌడ్ ఘనవిజయం సాధించారు. వరుసగా మూడో సారి గెలుపొంది హ్యాట్రిక్ అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సునీల్ గౌడ్ ను కలిసి అభినందలు తెలిపారు. 2011 మొదటిసారి
మొదటిసారి 2011లో బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలిచిన సునీల్ గౌడ్ న్యాయ వ్యవస్థలో ఎన్నో సేవలు అందించారు. 2018లో మరోసారి ఘనవిజయం సాధించిన సునీల్ గౌడ్ కు వైస్ ఛైర్మన్ బాధ్యతలు దక్తాయి. గత ఏడాది ఆయనను హైకోర్టు క్రికెట్ అసోసియేషన్ కెప్టెన్ గా కూడా ఎన్నుకున్నారు.
ఇప్పుడు మూడోసారి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. న్యాయవాదుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న సునీల్ గౌడ్ ను బార్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నుకోవాలని తెలంగాణ న్యాయవాద సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా తనను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతనంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.




