calender_icon.png 7 February, 2026 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి నేడు బంద్

07-02-2026 12:00:00 AM

ఆటో, క్యాబ్, టాక్సీ, లారీ డ్రైవర్ల జేఏసీ

ముషీరాబాద్/కుషాయిగూడ, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆటో, క్యాబ్, టాక్సీ, లారీ డ్రైవర్లలకు ఇచ్చిన హామీల అమలుకై, మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రవాణా రంగ కార్మికులు శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్ పాటిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్, టాక్సీ, లారీ డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో బంద్ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ బంద్ లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, రవాణారంగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ లు వి. మారయ్య, రామకృష్ణ రెడ్డి, వి. ప్రవీణ్, యాదగిరి, సత్తి రెడ్డి, అమానుల్లా ఖాన్, షేక్ మజీద్, శ్రీనివాస్, ఎస్. దయానంద్, శివ ఆనంద్, ఎస్. అశోక్, సిహెచ్. జంగయ్య, నరసింహ, శ్రీనివాస్ పాల్గొన్నారు.