10 June, 2026 | 2:43 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎంపీడీవో

07-02-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): మండలంలోని అచ్చయపల్లి,బొల్లారం, గ్రామాలలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాల ను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అకస్మాతిగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీ ణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని,త్రాగునీరు సరఫరా స్వచ్ఛమైన నీరును విద్యార్థులకు అందించాలన్నారు.అచ్చయ పల్లి గ్రామ ట్యాంకు లీకేజీలను పరిశీలించి లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలన్నారు.

బొల్లారం పాఠశాల ఉపాధ్యాయుల బృందం ఎంపీడీవోలు శాలువతో ఘనంగా సన్మానించారు. అలాగే గ్రామాలలో కూడా నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు ఇప్పటినుండే ఏర్పాటు చేసుకోవాలన్నారు.గ్రామాలలో మురికి కాలువలు,పరిసరాలు పరిశుభ్రత,చెత్త సేకరణ వివిధ పనులన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం రాఘవపల్లి గ్రామంలో నర్సరీని పరిశీలించి నర్సరీలో ఉన్న మొక్కలకు ఉదయం సాయంత్రం వేళలో సరిపడా నీటిని అందించాలని నర్సరీలో ఉన్న ప్రతి మొక్కను చనిపోకుండా బతికించాలన్నారు. గామ సర్పంచులు బెస్త సాయిలు, ప్రభు గౌడ్, కార్యదర్శులు వెంకట్ రాములు, సంతోష్ కుమార్, ఫీల్ అసిస్టెంట్లు ఫర్వినా బేగం,బెస్త మల్లయ్య  పాల్గొన్నారు.