21 April, 2026 | 3:22 AM

విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట

21-04-2026 01:58 AM

నిర్మల్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ఆశ్రమ గిరిజన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సంక్షేమ దినోత్సవం జరుపుకున్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని పరిశీలించి త్వరలో ఇండ్లకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు అన్ని విధాన ప్రోత్సహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీనాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.