ప్రైవేట్ దళారులను నమ్మి మోసపోవద్దు
నిర్మల్/లక్ష్మణచందా, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రైతులు ప్రైవేట్ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యాన్ని ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సారంగాపూర్ మండలం ఆలూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, డీఆర్‌డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
మొక్కజొన్న కనీస మద్దతు ధర 2,400/-లు, వడ్ల కనీస మద్దతు ధర 2,389/-గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, గ్రామ సర్పంచ్ ఈర్ల చిన్నయ్య, మండల అధ్యక్షులు నరేష్, బీజేపీ నాయకులు భోజన్న, ఈర్ల విజయ్ పాల్గొన్నారు. అలాగే నిర్మల్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్‌ఫోన్లను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వినూత్న పాల్గొన్నారు.






