15 March, 2026 | 7:19 AM

ఢిల్లీ ఓటములకు బ్రేక్

08-11-2024 12:57 AM

హైదరాబాద్: దబంగ్ ఢిల్లీ వరుస ఓటములకు బ్రేక్ పడింది. పీకేఎల్ -11 సీజన్లో ఆ జట్టు విజయాల బాట పట్టింది. గురువారం దబంగ్ ఢిల్లీ కేసీ 33 తేడాతో బెంగాల్ వారియర్జ్‌ను మట్టికరిపించింది. ఢిల్లీ కెప్టెన్ అషూ మాలిక్ సూపర్ టెన్‌తో మెరిశాడు.   తొలి నుంచే ఆధిక్యం కనబర్చిన ఢిల్లీ విజయం సొంతం చేసుకుంది.

ఢిల్లీలో లెఫ్ట్ రెయిడర్ వినయ్ 8 రెయిడ్ పాయింట్లతో మెరిశాడు. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 35 తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజ యం సాధించింది. మొదటి అర్ధ భాగంలో అంతో ఇంతో పోటీనిచ్చిన గుజరాత్, రెండో అర్ధ భాగంలో మాత్రం పూర్తిగా తేలిపోయిం ది. స్టార్ ఆల్‌రౌండర్ చియానే 3 రెయిడ్ పాయింట్లు, 3 టాకిల్ పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు.