18 August, 2026 | 10:55 AM

క్రీడలతో మానసిక ఉల్లాసం స్నేహభావం పెరుగుతుంది

18-08-2026 10:12 AM

బోథ్,(విజయక్రాంతి): క్రీడల వల్ల మానసిక ఉల్లాసం తో పాటు స్నేహభావం పెరుగుతుందని కరత్వాడ గ్రామ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం జీడిపల్లి గ్రామంలోని క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడువ్యసనాలకు దూరంగా చదువుల పైన దృష్టి సారించాలని కోరారు. క్రీడలపై ఆసక్తి పెరిగితే భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. క్రీడలతో పాటు చదువుల్లో రాణించి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సిడం భీమ్రావు అనసూయ లు ఉన్నారు.