16 April, 2026 | 10:48 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పోచంపల్లి చెరువు కాలువపై వంతెన నిర్మించాలి

26-04-2025 11:00 PM

సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు...

మణుగూరు (విజయక్రాంతి): పోచంపల్లి చెరువు కాలువపై వంతెన నిర్మాణం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. పగిడేరు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో గల పగిడేరు నుండి విప్పల గుంపు వెళ్లే రహదారిలో పోచంపల్లి చెరువు కాలువకు గతంలో చెప్టా నిర్మాణం చేయడం జరిగినది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెప్టా కొట్టుకుపోవడం జరిగిందన్నారు.

దీంతో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే అనేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వేసవికాలంలో పగిడేరు గ్రామంలో మంచినీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు ద్వారా త్రాగునీరు నామమాత్రంగానే వస్తున్నాయని, కొన్ని ప్రాంతాలకు పూర్తిగా త్రాగునీరు రాక ప్రజలు ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతర్గత రహదారులు హస్తావ్యస్తంగా ఉన్నాయని తక్షణమే రహదారులు నిర్మాణం చేయలాన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంజా రాజు, శాఖ కార్యదర్శి కుంజా నరసింహారావు, కుంజ రాజా, పర్షిక పాపారావు, కుంజా యుగంధర్, కుంజా ప్రసాద్ రావు, పూనెం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.