5 July, 2026 | 11:28 PM

శ్రీకాళహస్తి 'ట్రెండ్స్' కొత్త స్టోర్ ప్రారంభం

05-07-2026 10:26 PM

శ్రీకాళహస్తి, 2026: 

రిలయన్స్ రిటైల్‌కు చెందిన, భారతదేశంలోనే అతిపెద్ద , అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దుస్తుల , అనుబంధ ఉత్పత్తుల ప్రత్యేక విక్రయ సంస్థ 'ట్రెండ్స్' ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలో తమ కొత్త స్టోర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. మెట్రోలు, మినీ-మెట్రోల నుండి టైర్-1, టైర్-2 పట్టణాలు, ఆ పై ప్రాంతాల వరకు తమ పరిధిని విస్తరించటం ద్వారా భారతదేశంలో ఫ్యాషన్‌ను అందరికీ ట్రెండ్స్ అందుబాటులోకి తెస్తోంది.

ఇప్పుడు ఇది దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫ్యాషన్ షాపింగ్ గమ్యస్థానంగా నిలిచింది. శ్రీకాళహస్తిలోని ఈ ట్రెండ్స్ స్టోర్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంది. వినియోగదారులు మహిళలు, పురుషులు మరియు పిల్లల కోసం ట్రెండీ వస్త్రాలు, ఫ్యాషన్ యాక్సెసరీలను ఆకర్షణీయమైన ధరలకు కొనుగోలు చేస్తూ ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చు. శ్రీకాళహస్తి పట్టణంలో ట్రెండ్స్ కు ఇదే మొదటి స్టోర్. 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్, గొప్ప ఫ్యాషన్, అద్భుతమైన ధరలతో పాటు వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ప్రారంభ ఆఫర్‌ను కూడా అందిస్తోంది: రూ. 3,499 విలువైన కొనుగోలుపై ఒక ఆకర్షణీయమైన బహుమతిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.