పదవి లేనప్పుడు బట్లర్... పదవి రాగానే హిట్లర్!
మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తే పదవి లేనప్పుడు బట్లర్... పదవి రాగానే హిట్లర్! అనే లా ఉందని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఎంతోమంది త్యాగాలపై ఏర్పడిన తెలంగాణలో గతంలో బీఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మీకు కాపలా కుక్కలాగా ఉంటాం అంటూ మాయమాటలు చెప్పారని విమర్శించారు.
బట్లర్లా అనేక పథకాలను మీకు అందజేస్తామని హామీలు ఇచ్చారని, కానీ పదవి రాగానే గతంలో కేసీఆర్... తాను హిట్లర్లాగానే వ్యవహరిస్తాను అని చెప్పడం, ఇప్పుడు రెండేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పడం అత్యంత విచారకరమన్నారు. ఈమే రం సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.నిరంకుశ, రాక్షస మనస్తత్వం కలిగిన హిట్లర్‌తో తమను తాము పోల్చుకోవడం, అతనిని ఆదర్శంగా చెప్పుకోవడం శోచనీయమన్నారు.






