19 నుంచి ఎప్‌సెట్ కౌన్సెలింగ్
జూలై 10న తొలి విడత సీట్లు కేటాయింపు
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రిక ల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎపెస్‌ట్ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రి య కొనసాగనుంది. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఈ నెల 2౨ నుంచి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 25 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు కాలేజీలను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అవకాశం ఉంటుంది. వచ్చే నెల 4న మాక్ సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తారు. వచ్చే నెల 5నుంచి 7వ తేదీ వరకు ఎడిట్‌కు అవకాశం కల్పించారు.
జూలై 10న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. రెండో విడత కౌన్సిలింగ్ జూలై 17 నుంచి, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 31 నుంచి నిర్వహిస్తారు. ఇంటర్నల్ స్లుడింగ్ ఆగస్టు 12 నుంచి, స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు 16 నుంచి చేపట్టి అదే నెల 1వ తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తారు. కాగా ఈనెల 15 నుంచి టీజీ ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.






