1 July, 2026 | 1:49 AM

కంటైనర్‌లో గంజాయి గది!

01-07-2026 01:00 AM

ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు

  1. ఒడిశా నుంచి యూపీకి 525 కిలోల తరలింపు
  2. భద్రాద్రి జిల్లాలో పట్టుకున్న పోలీసులు 
  3. నలుగురి అరెస్టు, నిందితుల్లో బాలుడు

బూర్గంపహాడ్, జూన్ 30 (విజయక్రాంతి): కంటైనర్‌లో ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి, అందులో రూ.2.62కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని తరలిస్తుండగా.. భద్రాద్రి జిల్లా బూర్గంప హాడ్ మండలం సారపాకలో ఈగల్ ఫోర్స్ సిబ్బంది, బూర్గంపాడు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

ఒడిశాలోని మల్కాన్‌గిరికి చెందిన  సహదేవ్ హంతల్ (20) ఒడిశాలోని అల్లూరికోట అటవీ ప్రాంతం నుంచి 525 కిలోల గంజాయిని సేకరించి, అక్కడి నుంచి ఏపీలోని మోతుగూడెం, -తులసిపాక వరకు తరలించడానికి కూలీలను నియమించుకున్నాడు. తర్వాత తరలించిన గంజాయిని మహ్మద్ సైఫ్, ఫిరోజ్ భాయ్‌లకు చెందిన కంటైనర్‌లో లోడ్ చేశారు.

గంజాయి బస్తాలు పో లీసులకు కనిపించకుండా దాచడానికి కం టైనర్‌లో ప్రత్యేకంగా ఓ ఛాంబర్‌ను తయారు చేయించి దాచిన గంజాయి బస్తాలను తులసిపాక నుంచి  ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా ఈగల్ ఫోర్స్, భద్రాద్రి జిల్లా పోలీసులు  కంటైన ర్‌ను  బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ సంస్థకు చెందిన వెస్ట్ గేట్ వద్దకు రాగానే అడ్డుకొని  2.62 కోట్ల రూ పాయల విలువైన 525 కిలోల గంజాయిని ,కంటైనర్,  బైక్, ఐదు సెల్ ఫోన్లు,  10 ,570 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అలాగే సహదేవ్ హం తల్, అల్లూరి జిల్లా సోమిరెడ్డి పాలేనికి చెందిన డోగ్రి త్రినాథ్, ఉత్తరప్రదేశ్‌లోని బీజాపూర్‌కు చెందిన కులదీప్ శర్మలతో పాటు   మరో బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మిగ తా నిందితులైన మహ్మద్ సైఫ్, ఫిరోజ్ భాయ్, రాజా మిశ్రా, మహ్మద్ ఇమ్రాన్ ప రారీలో ఉన్నట్లు  పోలీసులు తెలిపారు.