ఆశ్వారావుపేటలో గ్రీవెన్స్ డే
అశ్వారావుపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపేందుకు ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఆశ్వారావుపేటలో నిర్వహించి కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమానికి మొత్తం 12. దరఖాస్తులు అందాయి.
శాఖల వారీగా దరఖాస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పంచాయతీ రాజ్ శాఖ 4 దరఖాస్తులు, రెవెన్యూ శాఖ 3 దరఖాస్తులు, మున్సిపల్ కార్యాలయం 2 దరఖాస్తులు, నీటిపారుదల శాఖ 1 దరఖాస్తు, హౌసింగ్ శాఖ 1 దరఖాస్తు, వ్యవసాయ శాఖ 1 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకునే విధంగా సూచనలు చేయడం జరిగింది అని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడతారని ఏం పి డి ఓ తెలిపారు.






