సిరియాలో ఆపద్ధర్మ ప్రభుత్వం ?
11-12-2024 01:49 AM
డమాస్కస్, డిసెంబర్ 10: సిరియా అధ్యక్షుడు అల్ అసద్ పత నం తర్వాత అక్కడి రాజకీయ సమీకరణాలు కీలక మలుపు తీసుకుంటు న్నాయి. తిరుగుబాటుదారుల అపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటుకానునట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. వారికి అధికారాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని సోమవారం ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలీ సైతం ప్రకటించారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని తా ను ఆశిస్తున్నట్లు వెల్లడించారు.






