2 July, 2026 | 11:28 AM

Breaking News

ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •  

మాజీ మంత్రి బంధువులపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..

18-10-2024 12:00 PM

తనకు తెలియకుండా తన ప్రాపర్టీ అమ్మేశారని దండు లచ్చిరాజు ఆరోపణ

ట్రెస్ పాస్ చీటింగ్ కేసు నమోదు

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి బంధువులపై మియాపూర్ పొలీస్ స్టేషన్ లో ట్రెస్ పాస్, ఛీటింగ్ కేసును నమోదు చేశారు పోలీసులు. దండు లచ్చిరాజు అనే వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీని ఆయనకు తెలియకుండానే మాజీ మంత్రి బంధువులు అమ్మేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు లచ్చిరాజు. తన ఇంటిని ఓ మాజీ మంత్రి తమ్ముడు తన్నీరు గౌతమ్, సమీప బంధువులు బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోనెల రాజ్ కుమార్ గౌడ్, గారపాటి నాగ రవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావులు తన ఆస్తిని ఆక్రమించుకొని ఇతరులకు అమ్మేశారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. మాజీ మంత్రి బంధువులు తనను ప్రాంసరీ నోటుతో మోసం చేశారని లచ్చిరాజు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా తన ప్రాపర్టీని విక్రయించి.. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న మియాపూర్ పోలీసులు వారిపై 420,448,504,506 రెడ్ విత్  ఐపిసి సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు.