2 July, 2026 | 12:05 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

02-07-2026 10:58 AM

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ(Anti Corruption Bureau) అధికారులు సోదాలు చేస్తున్నారు. నార్సింగిలోని వేసెల్లా మెడోస్ లోని భీమ్ రెడ్డి ఇల్లుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. భీమ్ రెడ్డి(DSP Bhim Reddy) నార్సింగిలో రూ. 8 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లాలో ఉంటున్నారు. భీమ్ రెడ్డి వద్ద భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమ్ రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని భీమ్ రెడ్డి మీద ఆరోపణలున్నాయి. డీజీపీ ఆఫీసులోని కంప్యూటర్ సర్వీసెస్ లో భీమ్ రెడ్డి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. భీమ్ రెడ్డికి చెందిన భారీ అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు(ACB officials) పేర్కొన్నారు.