2 July, 2026 | 11:51 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు

02-07-2026 10:45 AM

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో(Telangana) ప్రస్తుతం సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మంత్రులు, మాజీ మంత్రులు నువ్వానేనా తేల్చుకుందాం రా? అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు(Congress ministers) చర్చకు సిద్ధమయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చిద్దమాని మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ తెలిపారు. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై చర్చకు సిద్దమయ్యారు.

ఈ నేపథ్యంలోనే  మంత్రులు పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్(Azharuddin)తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గన్ పార్క్( Gun Park)కు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధమని మంత్రులు చెబుతున్నారు. చర్చకు రెడీ అంటూ కాంగ్రెస్ నేతలు అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించారు. బీఆర్ఎస్ అప్పులు, గురుకులాల్లో కాంగ్రెస్ స్కాం అంటూ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.  మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చర్చకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. హరీశ్ రావు ఈ సవాళ్లను మొదలు పెట్టారు, ఆయనను రమ్మనండని మీడియాతో మాట్లాడుతూ అడ్లూరి అన్నారు.