19-02-2026 01:13:25 AM
ఫలించని కాంగ్రెస్ ప్రయత్నాలు
అధికారం పంచుకునేందుకు ఏకమైన బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యే వెడ్మకు నిరాశ
ఖానాపూర్, ఫిబ్రవరి ౧౮ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార పగ్గాలు చేజిక్కించుకుంటామని ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్‌కు నిరాశ ఎదురైంది.
నిర్మల్ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానమున్న ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటై.. అధికార పార్టీకి చెక్ పెట్టాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే ఖానాపూర్ మున్సిపల్ పీఠా న్ని కైవసం చేసుకున్నందుకు చివరి వరకు ప్రయత్నాలు సాగించిన బీఆర్‌ఎస్, బీజేపీలో మార్పు లేక ఖానాపూర్ మున్సిపల్ పీఠం కోల్పోవలసి వచ్చింది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖానాపూర్‌లో మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ౩, బీఆర్‌ఎస్ ౪, బీజేపీ 4, ఇండిపెండెంట్‌గా ఒకరు విజయం సాధించారు. ఇండిపెండెంట్ కాంగ్రెసులో చేరారు. చైర్మన్ స్థానాన్ని జనరల్ కు కేటాయించడంతో 12 వార్డులు ఏడుగురు మద్దతు పలుకుతేనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్త య్యే అవకాశం ఏర్పడింది. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో తెలియక రాజకీయ పరిస్థితులు ఎటు దారితీస్తాయో తీవ్ర చర్చ జరిగింది.
ఎట్టకేలకు ఇరు ప్రతిపక్ష పార్టీలు ఏకమై కాంగ్రెస్‌కు అధికారం దక్కకుం డా నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్నామని అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలోని సభ్యులను తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయన నిర్మల్ జిల్లాకు అధ్యక్షుడు కావడంతో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో దక్కలేదు.
ఎమ్మెల్యేకు చెక్కు పెట్టేందుకు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వేడ్మ బొజ్జు పటేల్ రాజకీయాలకు ఖానాపూర్ ప్రాంతం లో చెక్కు పెట్టెందుకు బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటయ్యాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జు పటేల్ కు వ్యతిరేకంగా ఇటీవలే రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలతో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేశాయి. ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఇతర అభివృద్ధి పనులు నిధుల విషయంలో ఖానాపూర్ పట్టణానికి అన్యా యం చేస్తూ అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాం తానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ ఖానాపూర్ పట్టణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నిర్ణయానికి వ్యతిరేకంగా ఖానాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
దీంతో ఎమ్మెల్యే బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులపై ఆగ్రహంతో ఉండడంతో ప్రస్తుతం మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్‌కు ఇస్తే తమ ఉనికి మరింత ప్రమాదకరంగా ఉంటుందని భావించిన పార్టీలు ఎమ్మెల్యేకు ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ పీఠం దక్కకుండా పావులు కదిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ జూపల్లి కృష్ణారావు సీనియర్ నేత సుదర్శన్ గౌడ్ వంటి నేతలు ఖానాపూర్‌లో మున్సిపల్ ప్రీత్యాన్ని కైవసం చేసుకునేందుకు కొన్ని సందర్భంలో జోక్యం చేసుకున్నప్పటికీ వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధం కాలేదు.
గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పగ్గం చేపట్టకుం డా బిజెపితో మంతనాలు చేశారు. కేటీఆర్ కూడా ఖానాపూర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి అధికార పగ్గాలు పంచుకున్నందుకు చివరికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై వ్యక్తిగతంగా దూషిస్తూ సవాళ్లు విసరడంతో దాన్ని ఆ పార్టీలు జీర్ణించుకోలేకపోయాయి. కాంగ్రె స్‌కు అధికార పగ్గాలు దక్కకుండా రెండు పార్టీలు ఒకటయ్యాయి
కారు, కమలం అధికారం పంపిణీ
ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్, బీజేపీ నాలుగు స్థానాలు చొప్పున మొత్తం ఎనిమిది స్థానాలు విజయం సాధించారు. అయితే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవిలో విషయంలో ఆ పార్టీ ఇలా ఇద్దరు నేతలు చర్చలు నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం రెండుసార్లు నిర్వహించిన రాజీ మార్గం కుదరకపోవడంతో వాయిదా పడింది. రెండు పార్టీల కౌన్సిలర్లు ఎన్నికకు గైరాజరు అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చి తమ వైపు వస్తారని ఆశించారు.
అయితే ఆ పార్టీ అగ్రనేతలు మహేశ్వర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు రితేష్ రాథోడ్, ఖానాపూర్ నియోజకవర్గం జాన్సన్ నాయక్ బీఆర్‌ఎస్ ఖానా పూర్ ఇన్చార్జ్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రంగంలో దిగి రెండు పార్టీలకు కౌన్సిలర్ల మధ్య సయోధ్య కుదిరించారు. మొదటగా బీఆర్‌ఎస్‌కు రెండు సంవత్సరాలు, తర్వాత మూడు సంవత్సరాలు బిజెపికి చైర్మన్ పదవి ఇవ్వాలని, వైస్ చైర్మన్ పదవి రొటేషన్ పద్ధతిలో రెండు పార్టీలు పంచుకోవాలని కో ఆప్ష న్ సభ్యుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
బుధవారం ఇరుపార్టీల నేతలు పరస్పరం అంగీకర పత్రాన్ని రాసుకున్న తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో స్పష్టమైన ప్రకటన రెండు రెండు పార్టీల నేతలు ప్రకటించారు. మొదటిగా బీఆర్‌ఎస్ అభ్యర్థి తాళ్ళపల్లి రాజగంగన్నను ఛైర్మన్‌గా ప్రకటించారు. దీంతో ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కోఆప్షన్ సభ్యుల పదవులు పంచుకోవడంతో మొదట మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఎంపిక చేశారు. వైస్ చైర్మన్‌గా బిజెపికి అవకాశం కల్పించారు. దీంతో ప్రభుత్వం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు అధికారికంగా ఈ రెండు పార్టీలు పదవులను దక్కించుకోనున్నాయి. ఈనెల 15 నుంచి తీవ్ర ఉత్కంఠతకు దారి తీసిన ఖానాపూర్ మున్సిపల్ రాజకీయం ఎట్టకేలకు సమ స్య తీరి పోయినట్లయింది.