1 August, 2026 | 10:44 AM

సీపీఎస్ రద్దుకు కమిటీ నియమించాలి

03-09-2025 12:24 AM
  1. ఇతర రాష్ట్రాల సీపీఎస్‌పై డిప్యూటీ సీఎంకు రిపోర్టు అందజేత
  2. సీపీఎస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు స్థితప్రజ్ఞ 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సీపీఎస్ విధానం రద్దు దిశగా ప్రభుత్వం 6 నెలల కాల పరిమితితో కూడిన కమిటీని నియ మించి, పాత పెన్షన్ పునరుద్ధరణ వైపుగా అడుగులు వేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ కోరారు. ఈ మేరకు రాష్ర్టంలోని రెండున్నర లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుకుంటున్నారని తెలిపారు.

సీపీఎస్ విధానాన్ని హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రద్దు చేశారని, దీనిపై సవివరణ రిపోర్ట్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేశవరావుకు సచివాలయంలో కలిసి మంగళవారం అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఈ రిపోర్టులో సీపీఎస్ విధానంతో వచ్చే 60 సంవత్సరాల్లో ప్రభుత్వానికి, ఉద్యోగు లకు జరిగే ఆర్థిక నష్టంతో పాటు, ఓపీఎస్ పునరుద్ధరించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలకు సంబంధించిన రిపోర్టును రూపొం దించినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఈ నివేదికను ప్రత్యేక అంశంగా పరిగణించి చూడాలని అధికారులకు ఆదేశిం చారని పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో కల్వల్ శ్రీకాంత్, నరేశ్ గౌడ్, నరేందర్ రావు, కోటకొండ పవన్, శ్యామ్ ఉన్నారు.