జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో ఓం గణేష్ మండలి అన్నదానం
పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి , పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆనవాయితీగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ లో ఏర్పాటుచేసిన వినాయక ‘ శ్రీ ఓం గణేష్ మండలి‘ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం పూజా కార్యక్రమం అనంతరంఅన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,హాజరై పూజా కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణలో పాలుపంచుకున్నారు.
మొదట పూజా కార్యక్రమం అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ కలిసి ‘అన్నదాన కార్యక్రమం*‘ లో పాల్గోన్నారు పూజ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు స్వయంగా వారు వడ్డించారు. ఈ అన్నదాన కార్య క్రమంలో పెద్ద మొత్తంలో మానసిక వికలాంగుల పాఠశాల అయిన స్నేహా సొసైటీ విధ్యార్దులు,పోలీస్ సిబ్బంది,ప్రజలు హాజరై అన్న ప్రసాదం స్వీకరించారు.
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దినేష్ , అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) శ్రీ జి.బస్వా రెడ్డి డి ఎం అండ్ హెచ్ ఓ రాజశ్రీ , ఏడి ఫిషారీస్ ఆంజనేయులు , నిజామాబాద్ టౌన్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , రిజర్వు ఇన్స్పెక్టర్స్ లు , ఆర్.ఎస్.ఐలు , ఏ.ఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది, రేంజ్ కార్యాలయం సిబ్బంది , పోలీస్ కార్యాలయం సిబ్బంది , పోలీస్ గణేష్ మండలి సభ్యులు పాల్గొన్నారు.






