23 June, 2026 | 11:37 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

సఫారీలకు ఓదార్పు విజయం

24-09-2024 12:00 AM

మూడో వన్డేలో ఆఫ్గన్‌పై గెలుపు

షార్జా: అఫ్గానిస్థాన్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయిన సౌతాఫ్రికా నామమాత్రమైన మూడో వన్డేలో విజయం సాధించి పరువు కాపాడుకుంది. ఆదివారం రాత్రి జరిగిన చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ అఫ్గానిస్థాన్ 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రెండో వన్డే హీరో రహమనుల్లా గుర్బాజ్ (94 బంతుల్లో 89) మరోసారి రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెలుక్వాయో తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీలు 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. మార్కరమ్ (69 నాటౌట్) విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో విశేషంగా రాణించిన గుర్బాజ్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ వరించింది.