16 August, 2026 | 10:40 AM

సేవా పథకం అవార్డు అందుకున్న హేమచందర్

16-08-2026 10:05 AM

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ  చేతుల మీదుగా అవార్డు అందుకున్న హేమచందర్ పిల్లే.

తుంగతుర్తి,(విజయక్రాంతి): 80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హేమచందర్ పిళ్ళై ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది. దీంతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందనాల పవర్, జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. దీనితో తోటి పోలీస్ సిబ్బంది, మేధావులు, కుటుంబ సభ్యులు, చైతన్య భారతి పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.