16 August, 2026 | 12:07 PM

ఉత్తమ సేవా అవార్డు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్

16-08-2026 10:22 AM

బాన్సువాడ, ఆగస్టు 16 (విజయ క్రాంతి): 80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం లో శనివారం బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు వి హనుమంతరావు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. విధులలో నిబద్ధత అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కుమార్ అవార్డు అందుకోవడంతో పట్టణ పోలీస్ సిబ్బంది తోటి మిత్రులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.