16 August, 2026 | 11:30 AM

జాతీయ సమైక్యత అవార్డు అందుకున్న సిద్దెల

16-08-2026 10:39 AM

మణుగూరు, ఆగష్టు 16,(విజయక్రాంతి): 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా " వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు 2026 ను ప్రముఖ తెలంగాణ ప్రజా గాయకుడు, బిటియస్ ఉద్యోగి సిద్దెల హుస్సేన్ అందుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఆనందలహరి నిర్వహించిన జాతీయ సమైక్యత కార్యక్రమంలో భాగంగా, హైదరాబాదులోని రవీంద్రభారతిలో  ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు చేతులు మీదుగా సిద్దెల హుస్సేన్ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా సిద్దెల హుస్సేన్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత అవార్డు రావడం చాలా ఆనందదాయకమని, ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంచే విధంగా, బాధ్యతాయుతంగా, ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా తీర్చిదిద్దాలని, కర్తవ్యాన్ని  ఈ అవార్డు తనకు బాధ్యతను గుర్తు చేసిందని సిద్దెల హుసేన్ అన్నారు. అంతేకాకుండా కవులు కళాకారులు. దేశం గర్వించే విధంగా, దేశ సమైక్యతను చాటే విధంగా వారి కలాలకు గళాలకు పదును పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ పెద్దలు జెన్నీ, దైవజ్ఞ శర్మ, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏసీపీ నరేష్ రెడ్డి, వంశి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రాజు, ఆనందలహరి ఫౌండర్ మల్లం రమేష్ గారు, ప్రముఖ కమెడియన్లు నాగసాయి,మొగిలి గుణకర్ తదితరులు పాల్గొన్నారు