16 August, 2026 | 11:18 AM

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

16-08-2026 10:13 AM

బోథ్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వరరావు లబ్ధిదారులకు కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డులు ఎంతో విలువైనయని వాటిని దుర్వినియోగం చేయవద్దని గ్రామస్తులకు వివరించారు. ప్రభుత్వం నుండి సరఫరా అవుతున్న రేషన్ బియ్యం ప్రతి ఒక్కరూ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బియ్యం విక్రయిస్తే కేసులు తప్పవని ఆయన గ్రామస్తుల వివరించారు.