సమకాలీన శిల్పకారుడు!
ఏ కళైనా వీక్షకులకు ఆనందాన్ని కలిగించడమే కాదు, మానసికోల్లాసాన్ని, చైతన్యాన్నీ కలిగించగలిగితే ఆ కళ పరమ లక్ష్యం నెరవేరినట్టే. ఆ కళాకారుడికి అంతకన్నా సంతృప్తి మరొకటి ఉండదు. తెలంగాణ గడ్డ మీద పుట్టి కళారాధనకు జీవితాన్ని అంకితం చేసిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ శిల్పకారుడు ఎంవీ రమణా రెడ్డి. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందలకొద్ది వర్క్ షాప్‌లు, క్యాంపులు నిర్వహించి.. ఎందరో యువకళకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రమణా రెడ్డి చేసిన డిజైన్లు స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీలో.. పార్క్ హయత్‌లో.. నోవాటెల్‌లో.. చూడొచ్చు. మరీ ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం.. అమరజ్యోతిరూపకర్త కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి డిజైన్లు చేయడం ఆయన ప్రత్యేకత. తన నాలుగు దశాబ్దాల అనుభవాలను ఖజానాతో పంచుకున్నారు..!
మా అమ్మ బాలమణి, నాన్న దయనంద్ రెడ్డి. ఆయన ఆర్టీసీ కండక్టర్‌గా మొదలు పెట్టి డిప్యూటీ మేనేజర్ స్థాయి వరకు వెళ్లి రిటైర్ అయ్యారు. మాది ఒక వ్యవసాయ కుటుంబం. సిద్దిపేట జిల్లాలోని కూడారం గ్రామం. ప్రతి హాలీడేస్‌కు మా గ్రామానికి వెళ్లేవాళ్లం. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి తీయదనం.. కల్మషం లేని మనుషులను చూస్తే అద్భుతంగా అనిపించేది. చిన్నపిల్లోడి మనసులాంటి గ్రామం అనేది నా అభిప్రాయం. ఆ రకంగా అవన్నీ మాకు ఒంటబట్టినవి కాబట్టే ఇవాళ కళాకారుడిగా ఉండగలిగాను. గ్రామంలో కష్టం లేకుంటే జీవితం ఉండదు. వాళ్లు ఆ కష్టంలోనే సుఖాన్ని వెతుక్కుంటారు. అలా అవన్నీ చిన్నతనం నుంచి అలవాటు అయ్యాయి.
మీ జర్నీ గురించి చెప్పండి?
చిన్నప్పటిన్నుంచే ఆర్టిస్టు కావాలనే కోరిక ఉండేది. నాకున్న ఆసక్తిని కాపు రాజయ్య మా గురువు గారు గుర్తించి, ప్రోత్సహించారు. అలా హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో 1983లో చేరాను. కాలేజీలో నేను ఏ బొమ్మ చేసిన ఏదో ఒక మీడియాలో పబ్లిష్ అయ్యేది. అది కొంచెం నాకు ఇన్సిరేషన్‌గా అనిపించేది. అలా నేను ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడలిస్టుని.ఆ తర్వాత బరోడాకు వెళ్లాను. అక్కడ ఎమ్‌ఎస్ యూనివర్సిటీలో ఒక 7,8 నెలలు డిజైన్లు చేశాను. తర్వాత ఊహించలేని విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను జర్మనీకి పంపించడం జరిగింది. అట్లా నేను 1991లో జర్మనీ వెళ్లాను. నా అదృష్టం కొద్ది మోమింగనస్ అనే టౌన్‌లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశం మూడు నెలల కాలం. అయితే చాలాసార్లు అటు, ఇటు తిరిగాను. ఒక ఏడాదికి రెండు, మూడు సార్లు వెళ్లి వచ్చేవాణ్ని. ఆ తర్వాత నేను అక్కడే స్థిరపడిపోయాను.
ఎన్ని దేశాలు పర్యటించారు?
మన భారత దేశానికి ఒక పురానతమైనటువంటి సంస్కృతి ఉంది. కానీ ఆధునిక చిత్రకళలో వెస్ట్రన్ సొసైటీలో కళలు మనకన్నా ముందంజలో ఉన్నాయి. మనం మొదటి నుంచి నిజాం పరిపాలనలో ఉన్నాం కాబట్టి.. చిత్రకళలో అంతగా పరిపక్వత రాలేదు. కానీ వెస్ట్రన్, యూరోపియన్ సొసైటీల్లో కళలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడే మ్యూజియమ్స్, గ్యాలరీలు ఎక్కువగా కనిపిస్తాయి. నాలాంటి తృష్ణ ఉన్నవారికి అదొక స్వర్గం లాంటిది. నేను ఎక్కువగా తిరిగేవాణ్ని. ఒకచోట కుదుటగా ఉండేవాణ్ని కాదు. లండన్, న్యూయార్క్, పారిస్..దాదాపు ఒక 80 దేశాల నగరాలు తిరిగాను. అలా ఒక్కొక్క దేశంలో ఆరు నెలలు, ఒక సంవత్సరం ఉండేవాణ్ని. ఉదయం లేచినప్పటి నుంచి నా పని గ్యాలరీస్, మ్యూజియమ్స్ తిరగడం.. వాళ్ల వర్క్ స్టుల్ ఎలా ఉందో గమనించడం నా పని. అలా విస్త్రృతంగా అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా దేశాల్లో చాలాసార్లు పర్యటించాను.
ఇప్పటి వరకు ఎన్నీ వర్క్ షాప్స్, ఎగ్జిబిషన్స్ నిర్వహించారు?
అట్లా ఆధునికతకు సంబంధించిన శిల్పాలపై ప్రయోగాలు చేశాను. యూరోప్ అనేది ఒక విశాలమైనటువంటి ప్రపంచం. సో అక్కడ చాలా ఎగ్జిబిషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహించేవాణ్ని. నా డిజైన్లు చూసి మెమింగ్, మ్యూనిక్, బెర్లిన్, ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ, న్యుయార్క్, జపాన్ దేశాలు కూడా నన్ను ఆహ్వానించాయి. అట్లా విస్త్రృతంగా ఎగ్జిబిషన్స్ నిర్వహించిన తర్వాత 2007లో పర్మినెంట్‌గా భారత దేశానికి వచ్చాను. 2007లోనే నన్ను జీఎమ్‌ఆర్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు వాళ్లు ఆర్ట్ కన్సల్టెంట్‌గా పెట్టుకున్నారు. నా డిజైన్లు ప్రస్తుతం పార్క్ హయత్, నోవాటల్, హరిత ప్లాజా, పెద్ద పెద్ద స్కల్పర్స్, మ్యూరల్స్‌లో కనిపిస్తాయి. నిజానికి మన తెలంగాణ ప్రాంతంలో కళాలకు పెద్దగా ప్రోత్సాహం లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంకా దుర్భరమైన పరిస్థితి ఉండేది. యువ కళాకారులు ఎదగాలనే తాపత్రయం ఉన్నప్పటికీ అవకాశాలు, ప్రోత్సహం అనేది లేదు. ముఖ్యంగా ఆర్టిస్టుకు డబ్బులకంటే ఎక్కువగా కావాల్సింది ఎమోషనల్ సపోర్టు.
అమరవీరుల స్మృతివనం ప్రత్యేకత ఏంటి?
ప్రపంచంలో ఎక్కడైనా అమరులు అనగానే దీపం, జ్యోతి, వెలుగులతో నివాళులు ఇస్తారు. మతాలకు అతీతంగా ఈ సంప్రదా యం ఉంది. నేను కూడా తెలంగాణ అమరులకు నివాళిగా దీపాన్ని ఎంచుకున్నాను. మట్టి దీపం నుంచి స్ఫూర్తి పొంది, దానికి కాస్త మోడర్న్ కాంటెంపరరీ ఫామ్ ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన కట్టడం నిర్మించాలనే ఉద్దేశ్యంతో స్టెయిన్ లెస్ స్టీల్ తో 316 ఎల్ అనే గ్రేడ్‌తో చేశాం. అది వందేళ్లు అయినా తుప్పు పట్టదు. అలాంటి స్టీల్ ఎంచుకున్నాం. ఈ భవనానికి ప్రత్యేకత ఏంటంటే.. ఈ భవనమే ఒక శిల్పం. కానీ వట్టి శిల్పం కాదు. ఈ శిల్పంతో ఉపయోగం ఉంది. ఒక ప్రయోజనం ఉంది.
కళారీతుల్లో మనదేశానికి, వేరే దేశాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి?
మన దేశానికి, వేరే దేశాలకు చెందిన కళారీతుల్లో చాలా తేడాలు ఉంటాయి. అన్నీ రంగాల్లో పురోగతి జరిగినప్పుడు మన ఆలోచనల ధోరణి కూడా మారుతూ ఉంటుంది. పాత కాలంలో దోతి, పంచకట్టేవాళ్లు. అప్పుడున్నటువంటి సంస్కృతి, సంప్రదాయక, సామాజిక పరిస్థితులు కావొచ్చు.. లేకుంటే జీవన విధానమే కావచ్చు.. అవన్నీ మనకు ఒక పద్ధుతులను, కల్చర్‌ను నేర్పించాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా విస్తరించింది. అదే యూరోప్‌లో చూస్తే అవన్నీ ఇండస్ట్రీయల్ నేషన్స్. అది మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు. మరేదన్నా కావచ్చు. సంప్రదాయ పద్ధతులను లైఫ్ స్టుల్‌కు ఆప్లు చేసుకొని.. అక్కడ్నంచి ఇండస్ట్రీయల్ వైపుకు తీసుకెళ్లారు. అట్లా వాళ్లు ప్రతిదీ అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తున్నారు. మన దేశంలో ట్రెడిషనల్ బంధాలు ఎక్కువగా ఉంటాయి.
కళకారులకు ఆదరణ ఎట్లా ఉందనుకుంటున్నారు?
నిజానికి నేను 2007లో ఇండియాకు వచ్చినప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. యువ కళాకారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి? ప్రోత్సాహం.. గైడెన్స్ లేదు? అవన్నీ కూడా నేను ఎదుర్కొన్నాను. నా తెలివి తేటలను నలుగిరికి నేర్పించడం, పంచుకోవడం అనేది నా అటిట్యూడ్. అలా నా వరకు కొత్త వారిని పరిచయం చేశాను. క్యాంపులు నిర్వహిస్తే ఆర్ట్‌ను ఇష్టపడే యువతకు ఒక మార్గం చూపించొచ్చు అనేది నా అభిప్రాయం. ఆర్టిస్టుకు డబ్బులకంటే ఎక్కువగా స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్‌యే వాళ్లను ముందుకు నడిపిస్తుంది. ఆర్టిస్టుకు ప్రారంభ దశలో ప్రోత్సాహం, గైడెన్స్ అనేది చాలా కీలకం.
మీకు సంతోషం కలిగిన సందర్భం?
జీవితం అంతా ఆర్ట్ చేయడమే పెద్ద సంతోషకరం. అంతకుమించిన ఆనందం ఉండదు. ఒకవేళ ఆర్ట్ చేయకపోతే సంతోషం అనేది ఉండేది కాదు. ఉదాహరణకు తెలంగాణ స్మారణ అమరవీరుల స్మరకం ఉంది. అమరవీరులకు స్మరకం ఎట్లా చేయాలి? అనే ఆలోచనలో కాస్త భిన్నంగా వ్యక్తీకరించడం జరిగింది. మన దగ్గర తొలి, మలి తెలంగాణ ఉద్యమాలు ఉన్నాయి. తొలిదశ ఉద్యమంలో ప్రభుత్వ హత్యలు, మలిదశ మొత్తం ఆత్మహత్యలు మనం ఈ రెండింటిని కూడా పెద్ద గ్లోరిఫై చేయాలేం. ఎందుకంటే మనిషి జీవితానికి ఒక పోరాటం చేసే స్వభావం ఉండాలి. అందుకే అమరవీరుల కంట్రిబిషన్ ఉంది కాబట్టి అందరి జాపకంగా అమరవీరుల దీపం చేశాను. ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, వాళ్ల కంట్రిబ్యూషన్‌కు సంబంధించి లోపల మ్యూజియం ఏర్పాటు చేశాను. ఇది చరిత్రలో పదిలంగా నిలిచిపోయే జ్ఞాపకం.
ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉందా?
నేను జర్మనీ నుంచి వచ్చినప్పుడు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్ద ఎత్తున్న నడుస్తున్నది. అది కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నది. నేను తెలంగాణకు వచ్చాక ఒక కళకారుడిగా ఆర్టిస్టులందరిని జమజేసి వివిధ జిల్లాల్లో ఆర్ట్ క్యాంపులు నిర్వహించాను. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించాను. క్యాంపుల్లో ముఖ్యంగా జర్నలిస్ట్‌లపై దాడులు, ఢిల్లీలో నిర్భయ ఘటనపై ఇలా ప్రతి సామాజిక అంశంపై ఆర్ట్ క్యాంపులు నిర్వహించాను. కళాకారులు సమాజంలో భాగం. సమాజానికి కళాకారుల అవసరం చాలా ఉందని నా ఉద్దేశ్యం. అప్పుడు కేసీఆర్‌కు జేఏసీ వాళ్లు సపోర్టుగా ఉండేవాళ్లు. జేఏసీకి ప్రతి పోస్టర్ కూడా నేను చేసిందే. దాంట్లో రైలు రోకో.. సకలజనుల సమ్మె.. సాగరహారం, బుక్ కవర్ డిజైన్లు, లోగోలు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఒక లోగోను తయారు చేశాను. అది పిడికిలి పైకెత్తినట్టు ఉంటుంది. అప్పట్లో అది చాలా పాపులర్ అయింది. దాన్ని ఉద్యమ సమయంలో ఒక సింబల్‌గా వాడుకున్నారు.
ఈ తరం వాళ్లకు మీరిచ్చే సలహా?
భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది చాలా ఊహించలేని పరిణామం. నేను ఇక్కడే కూర్చొని త్రీడి స్కల్పర్ ఇక్కడే గాల్లో చేయొచ్చు. అట్లంటివి ఎన్ని చేసినా.. చివరికి మనిషి తయారు చేసినవే చాలా ప్రత్యేకమైనవని చెప్పొచ్చు. మనం ఎంత ఆటోమెటిక్ మిషన్స్‌కి, రోబొటిక్స్ ఫుడ్ తయారు చేసినా.. మనం చేసుకునే భోజనం వేరు ఉంటది కదా. అమ్మచేతి వంట అని ఊరికే అనరు కదా. ఆ రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ అనేది విస్తృతంగా పెరిగిపోతున్నది. క్రియేటివిటీ లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఏదో ఒక రకమైన క్రియేటివిటీ అనేది కచ్చితంగా అవసరం. పిల్లలకు కూడా ఆ విధమైన ప్రోత్సాహం ఇవ్వాలి. చాలామంది చదువు, ర్యాంకులు, మార్కులు వాటి మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. కానీ ముఖ్యమైనది ఏంటంటే డిఫరెంట్ స్కిల్స్ పిల్లలకు నేర్పించడటం ముఖ్యం అనేది నా ఉద్దేశ్యం.
ఒక్క డిజైన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?
తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని నేను ఒక్క రోజు రాత్రిలో వేసిందే. నేను మొదట్లో ఇచ్చిన డిజైన్ నక్షత్రంలా ఉండే భవనం. అంటే మనం అమరులను ధృవతారలు అనుకుంటాం కాబట్టి అన్నీ స్టార్స్ బిల్డింగ్‌కు పెట్టాను. కానీ ఆ తర్వాతి క్రమంలో ఆ డిజైన్ కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయింది. నేను మా ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి ముందు దీపం వెలిగించి ఉంది. ఎక్కడైన నివాళి అంటే క్యాడిల్‌తోటో.. ల్యాప్స్‌తోటో చెప్తం. మన హిందూ సంప్రదాయంలో కూడా పిట్టకు పెట్టడం, దీపం పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా ఆ వ్యక్తికరణ అనేది నివాళిగానే గుర్తించబడుతుంది. అందుకనే ఆ దీపాన్ని రూపొందించాను. అలా మోడ్రన్, టెక్నికాలిటీ.. జోడించి తయారు చేసిందే అమరవీరుల జ్యోతి.
రూప






