26 August, 2026 | 4:52 PM

నగరంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

26-08-2026 04:14 PM

ర్యాలీలో పాల్గొన్న మాజీ సుడా చైర్మన్ 

ముకరంపుర, ఆగస్టు 26(విజయ క్రాంతి): మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను బుధవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా జమున తెహజీబ్ను కాపాడటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని ఆ మహనీయుడు చూపిన బాటలో నడిచి ప్రతి ఒక్కరూ జీవితాన్ని పునీతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.