26 August, 2026 | 5:46 PM

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు పర్యాటకులు గల్లంతు

26-08-2026 05:04 PM

నేపాల్: నేపాల్‌లోని భోటే కోషి నదిలో ఆకస్మిక వరద సంభవించాయి. నువాకోట్, ధాడింగ్ జిల్లాలను వరదలు ముంచెత్తడంతో కనీసం 16 మంది మరణించారని, అలాగే 105 మంది భారతీయులతో సహా పలువురు గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. సరిహద్దుకు ఆవల ఉన్న టిబెట్ ప్రాంతం నుండి ముంచెత్తిన ఈ వరద ప్రవాహం భారీ నష్టాన్ని కలిగించడమే కాకుండా, నేపాల్‌లోని అనేక గ్రామాలు కొట్టుకుపోయ్యాయి. వరదలకు 6 జల విద్యుత్ కేంద్రాలు, సబ్ స్టేషన్లు ధ్వంసం కావడంతో ఉత్తర నేపాల్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

 కేంద్ర పోలీసు అధికార ప్రతినిధి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినరాయణ్ కఫ్లేను ఉటంకిస్తూ, నువాకోట్, ధాడింగ్ జిల్లాల నుండి  ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వరద సహాయ చర్యల్లో 12 హెలికాప్లర్లు, పాల్గొని, పలువురిని కాపాడాయి. నేపాల్ పర్యాటక బోర్డు సమాచారం ప్రకారం... ఆకస్మిక వరద ప్రభావిత ప్రాంతం నుంచి 384 మంది యాత్రికులు గల్లంతయ్యారని, వీరిలో 186 మంది విదేశీయులు, వారిలో పలువురు అమెరికా, యూకే, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్  పౌరులు,  93 మంది నేపాల్ పౌరులు ఉన్నారని, విదేశీయులలో 105 మంది భారతీయ పౌరులేనని అధికారులు తెలిపారు. 

రసువా జిల్లాలో 26 మంది నేపాల్ పోలీసు సిబ్బంది, ఏడుగురు సాయుధ పోలీసు దళం (Armed Police Force) సిబ్బంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. నేపాల్ సైన్యం ప్రభావిత ప్రాంతానికి హెలికాప్టర్లను, విపత్తు సహాయక సిబ్బందిని తరలించినట్లు సమాచారం. +977 985 131 6807, +977 970 910 7500 హెల్ప్ లైన్ నంబర్లను నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం ఇచ్చింది.