వక్రంగీ నిధుల సమీకరణ ప్రతిపాదన
18-12-2024 12:01 AM
* 21న బోర్డు సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 17: బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో లాస్ట్ మైల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న వక్రంగీ విస్తరణకు నిధు లు సమీకరించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి డిసెంబర్ 21 శనివారంనాడు తమ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రైట్స్ ఇష్యూ, వారెంట్లు, ప్రి ఫరెన్షియల్ ఇష్యూ ద్వారా అర్హమైన సం స్థాగత ఇన్వెస్టర్లకు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ చేయాలన్నది కంపెనీ ప్రతిపాదన. ఇటీవల సెంట్ర ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో వక్రంగీ కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ (సీబీసీ) ఒప్పం దాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు అందించగలుగుతామని వక్రంగీ తెలిపింది.




