23 August, 2026 | 6:56 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

1:10 నిష్పత్తిలో పీసీ జ్యూయెలర్స్ షేరు విభజన

18-12-2024 12:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 17:  ఆభరణాల రిటైల్ చైన్ నిర్వహిస్తున్న పీసీ జ్యూయెలర్స్ షేరును  1:10 నిష్పత్తిలో విభజించింది. ప్రతీ ఒక షేరును 10 ఈక్విటీ షేర్లగా విభజించగా, ఇందుకు డిసెంబర్ 16 రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. విభజన అనంతరం వరుసగా రెండు రోజులూ 5 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్‌ను తాకిన పీసీ జ్యువెలర్స్ మంగళవారం బీఎస్‌ఈలో రూ.19.25 వద్ద ముగిసింది.

రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా ఇటీవల కంపెనీ బోర్డు  బ్యాంక్‌ల కన్సార్షియంకు ప్రిఫరెన్సియల్  ప్రాతిపదికన రూ.10 ముఖవిలువగల 5.18 కోట్ల షేర్ల కేటాయింపును ఆమోదించింది. ఈ మేరకు కన్సార్షియంకు ఒక్కో షేరుకు రూ.292 ధరతో 5.18 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో పీసీ జ్యుయెలర్స్ రూ.505 కోట్ల ఆదాయంపై రూ. 124 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది.