మారుతి సుజుకి రికార్డు
18-12-2024 12:03 AM
* ఒకే ఏడాదిలో 20 లక్షల కార్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశంలో నంబర్‌వన్ కార్ల కంపెనీ మారుతి సుజుకి కొత్త రికార్డును నెలకొల్పింది. తొలిసారిగా ఒకే క్యాలండర్ సంవత్సరంలో కార్ల ఉత్పత్తిలో (2024) 20 లక్షల మార్క్‌ను సాధించింది. 20 లక్షలవ వాహనంగా ఎర్టిగా కారును తమ మనేసర్ ప్లాంట్ నుంచి రోలవుట్ చేసినట్లు మంగళవారం మారుతి సుజుకి తెలిపింది. ఈ ఏడాది ఉత్పత్తి చేసిన 20 లక్షల వాహనాల్లో 60 శాతం హర్యానాలో, 40 శాతం గుజరాత్‌లో తయారయ్యాయని పేర్కొంది. ఉత్పత్తి చేసిన వాహనాల్లో బలెనో, ఫ్రాంక్స్, ఎర్టిగా, వ్యాగన్ ఆర్, బ్రెజ్జాలు టాప్ ఫైవ్‌లో ఉన్నాయన్నది.




