21 April, 2026 | 5:41 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

దేవుడు ఇచ్చిన ఆత్మీయ కానుక ఆడపిల్ల

10-04-2025 01:50 AM

సారధినగర్‌లో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం, ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ):-ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం తల్లిదండ్రులకు భగవంతుడు ఇచ్చిన ఆత్మీయ కానుక అని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మా పాప మా ఇంటి మణి దీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణం సారధి నగర్ లోని మౌనిక - సురేష్ దంపతులకు 2025, మార్చి 1న ఆడపిల్ల జన్మించిందని, ఈ సందర్భంగా బుధవారం ఈ కుటుంబానికి జిల్లా కలెక్టర్ స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, బట్టలు, సర్టిఫికెట్ అందించి తల్లిదండ్రులను, అత్తమామలు ఆరూరి మంగమ్మ, ఆరూరి నరసింహాలను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటిలో అమ్మాయిలు ఉంటే ఇల్లు కళ కళ లాడుతుందని, ప్రతి ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించాలని,  కుటుంబానికి గొప్ప పేరు తీసుకుని వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి  కే. రామ్ గోపాల్ రెడ్డి, ఖమ్మం అర్బన్ మండల తహసిల్దార్ రవి కుమార్, సిడీపీఓ వీరభద్రమ్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.