19 June, 2026 | 2:49 AM

ఒక రోజు ఆలస్యంగా దీవాన

19-06-2026 12:34 AM

యంగ్ హీరో హర్షిత్‌రెడ్డి ‘దీవాన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ చిత్రం గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా.. ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నెల 19న పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. నరేశ్ వీకే, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్ చంద్; డీవోపీ: వంశీ పచ్చిపులుసు; ఎడిటర్: హృషికేశ్ పాస్పల్; ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ గోజల; నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి; స్క్రిప్ట్, డైరెక్షన్: శ్రీకాంత్ సంగిశెట్టి.