అబ్బురపరిచే ‘అమూల్యం’
26-05-2024 01:42 AM
హైదరాబాద్, మే 25, (విజయక్రాంతి): స్నేహితులు, సన్నిహితుల వివాహ మహోత్సవానికి ఏం కానుక తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే.. ఒక్కసారి మీరు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని అమూల్యం స్టోర్స్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ మీకు కళాత్మకమైన వంట సామగ్రి, బహూకరణ వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయి. సుశాంత్ అగర్వాల్, త్రిషలా అగర్వాల్ దంపతులు శనివారం ఈ వినూత్నమైన స్టార్టప్‌ను ప్రారంభించారు. వీరు కరీంనగర్‌కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులతో వస్తువులు తయారు చేయిస్తున్నారు..






