9 August, 2026 | 8:25 PM

ఓటమి తప్పదనే బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలు

26-05-2024 01:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (విజయక్రాంతి) : పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి తప్పదనే బీఆర్‌ఎస్ నాయకులు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం మేడిపల్లి  పోలీస్ స్టేషన్‌లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిపై  ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన మనోధైర్యాన్ని దెబ్బ తీయడం ద్వారా తనను ఎదుర్కొలేరని బీఆర్‌ఎస్ పార్టీ నేతలను హెచ్చరించారు. కేటీఆర్ నీతిమాలిన చర్యలను మానుకోవాలని సూచించారు.